KRNL: విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి సోమవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. పెండింగ్లో ఉన్న విద్యాదీవెన, విద్యా వసతి బకాయిలు విడుదల చేయాలని, డిగ్రీలో మేజర్, మైనర్ హానర్స్ విధానాన్ని రద్దు చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిరసనకు దిగారు. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.