KRNL: భారత విద్యార్థి ఫెడరేషన్ గోనెగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండలంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గోనెగండ్ల మండల అధ్యక్ష కార్యదర్శులు పవన్ తేజ, రంగస్వామి మాట్లాడుతూ.. గోనెగండ్ల మండలంలోని చాలా గ్రామాల్లో పాఠశాలలకు సరైన గదులు లేకపోవడం చాలా భాధగా వుందన్నారు.