కృష్ణా: రాజధాని అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా వెళ్లే విజయవాడ బైపాస్ రోడ్ పనులను సీఎం చంద్రబాబు శనివారం పరిశీలించారు. బైపాస్ రోడ్ పనుల పురోగతి గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, CRDA అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ బైపాస్ రోడ్ పూర్తయితే అమరావతి, విజయవాడ-గుంటూరు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఎద్దడి తగ్గుతుంది.