KRNL: ఇతర ప్రాంతాలకు వలసలను ఆపాలని, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ మహిళా కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ‘వలసలను నివారించాలి, ఉపాధి కూలి పెంచాలి’ అని మంగళవారం కర్నూలులోని 48వ వార్డు రోజా వీధిలో ప్రభుత్వాన్ని కోరారు. ఆదోని డివిజన్లో పనులు లేక, రైతుల పంటలకు సరైన ధరలు లేక పెద్దలు వలసలు వెళ్లడంతో పిల్లలు కార్మికులుగా మారుతున్నారన్నారు.