SKLM: వరి పంటలో ఆశ్రయిస్తున్న సుడిదోమ నివారణపై రైతులు అవగాహనతో ఉండాలని ఆమదాలవలస మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఆమదాలవలస మండలం కొరపాం గ్రామంలో స్థానిక రైతులతో పొలం పిలుస్తోంది కార్యక్రమం సమావేశం నిర్వహించారు. పంటలను ఆశ్రయించే చీడపీడల నివారణకు అవసరమయ్యే వివిధ రకాల మందులను రైతులకు వివరించారు.