ప్రకాశం: వరి, కంది పంటలు సాగు చేసిన రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి ఎండీ.ఫరూక్ సూచించారు. బుధవారం మండలంలోని ఉమామహేశ్వరపురంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి, కందిలో ఆశించిన అగ్గి తెగులు నివారణకు ట్రైసెక్లోజోల్ 75% ఎకరాకు 120గ్రా, పిచికారి చేయాలని సూచించారు.