కృష్ణా: వరద బాధితులకు సహాయం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంకలోని కట్ట కింద ప్రాంతంలో వరద బాధితులు 80 కుటుంబాల వారికి నియోజకవర్గ విద్యా కుటుంబం ఆధ్వర్యంలో వంట పాత్రలు, కుక్కర్లు సహాయంగా అందచేశారు. వరద బాధితులకు ఎంఈఓలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి విస్తృత సహాయం అంద చేశారని తెలిపారు.