ఎన్టీఆర్: కొండపల్లి ఐడీఏ హెచ్పీ గ్యాస్ ప్లాంట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులు కాల రాస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం. మహేష్ డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.