ప్రకాశం: కంభం పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి యర్రగొండపాలెం నుంచి నెల్లూరు పోర్టుకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 650 బస్తాల రేషన్ బియ్యాన్ని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ పట్టుకున్నారు. లారీ, డ్రైవర్, క్లీనర్‌ను ఆయన పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.