GNTR: మాజీ సీఎం జగన్ గుంటూరు చేరుకున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరు పరేడ్ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయ్యారు. కాసేపట్లో సహానా కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. అనంతరం.. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.