BPT: బాపట్ల ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్ వద్ద గల రైతు బజార్‌ను మున్సిపల్ కమీషనర్ రఘునాథ రెడ్డి బుధవారం పరిశీలించారు. రైతు బజార్ నందు దుకాణాలు కేటాయించినప్పటి రోడ్డును ఆక్రమించి వ్యాపారాలను నిర్వహిస్తున్న వారిని అక్కడనుండి తరలించారు. ఎవరైనా రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే సహించేది లేదని కమిషనర్ హెచ్చరించారు.