అన్నమయ్య: జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం రాయచోటిలో దీపం-2 పథకాన్ని ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేకూరి తెలిపారు. నంద్యాలలో రేపు ఉదయం బయలుదేరి 10 గంటలకు రాయచోటి చేరుకుంటారన్నారు. 11 గంటలకు టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో సమావేశం అవుతారన్నారు. 11.30కి దీపం-2 పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం 4 గంటలకు రేణిగుంటకు వెళుతారని వెల్లడించారు.