కోనసీమ: జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన తిరుపతి లడ్డు ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. బాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు మండపేటలో గల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శనివారం పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలన్నారు.