VZM: నవంబర్ మూడో వారం నుంచి జిల్లాల్లో ధాన్యం సేకరణ ప్రారంభం కానుందని దీనికోసం ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బంధీగా ఈ ప్రక్రియను నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.