ప్రకాశం: మార్కాపురంలో సోమవారం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి 4 వీధుల్లో వారి సేవలు స్మరించుకుంటూ విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా.. ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసువులు బాసిన పోలీస్ వీరులారా మీకు వందనం అంటూ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కొనియాడారు.