E.G: రాజమండ్రి రూరల్ చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహిత విశాఖపట్నం వాసితో ఇంస్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంది. ఆ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సదరు మహిళ తన వద్దనున్న రూ. 4లక్షల నగదు, బంగారం ఇచ్చేసింది. ఆ బంగారు ఆభరణాలు విషయమై ఇంట్లోని వారు ప్రశ్నించడంతో కలహాలు మొదలయ్యాయి. దీంతో సదరు వివాహిత పుట్టింటికి వచ్చి ఉరేసుకుని మృతి చెందిందని పోలీసులు తెలిపారు.