NLR: రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం సాయంత్రం నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల మధు తల్లి శాంతమ్మ మృతి చెందిన నేపథ్యంలో నెల్లూరు 4వ డివిజన్లోని ఆయన నివాసానికి మంత్రి చేరుకుని శాంతమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తాము అండగా ఉంటామని మధుకు మంత్రి నారాయణ భరోసానిచ్చారు.