AKP: దేవరాపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు మండల స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో సత్తా చాటారు. అండర్-14 ఖోఖో,వాలీబాల్, చదరంగం, యోగా, వాలీబాల్ పోటీల్లో ప్రధమ, కబడ్డీలో ద్వితీయ స్థానం సాధించారు. అండర్-17 వాలీబాల్ పోటీల్లో ద్వితీయ స్థానం, అట్లాటిక్స్ లో ప్రథమ,ద్వితీయ స్థానాలు సాధించారు. ప్రిన్సిపల్ జయప్రకాష్, పిడి జి తరుణేశ్వరరావులు అభినందించారు.