ASR: ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్టు పంచాయతీ పరిధి నేరేడుపుట్టు గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక సమీపంలోని కొండ కాలువల ఊట ద్వారా వచ్చే కొంచెం కొంచెం నీటితో తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.