ప్రకాశం: బల్లికురవ మండల పరిషత్ కార్యాలయంలో సంతమాగులూరు ఐసీడీసీ CDPO సుధా ఆధ్వర్యంలో బాలల హక్కులు బాలవివాహాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థినీలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికలు చట్టాల పట్ల అవగాహన పెంచుకుంటే ధైర్యంగా ఉండవచ్చు అన్నారు.