NTR: బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్లో ఐదు రోజుల నుంచి తాగునీరు లేదని ప్రయాణికులు ఆరోపించారు. చుట్టుపక్కల నుంచి, ఇతర జిల్లాల నుంచి ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్లో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరారు.