ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం డీజిపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు డేగరత్తమ్మ (58) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం పశుగ్రాసం కోసం గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లగా ఆమె ఒంటిపై గల బంగారం కోసం దుండగులు హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పామూరు సీఐ భీమా నాయక్, చంద్రశేఖరపురం ఎస్సై సుమన్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.