ELR: ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమంలో కొయ్యలగూడెం మండలానికి చోటు దక్కింది. వరల్డ్ ఫుడ్ ఇండియా నిర్వహణకు 2024 సంవత్సరం భారతదేశం వేదికగా నిలిచింది. సెప్టెంబర్ 19 తేదీనుంచి 22వ తేదీ వరకు ఢిల్లీలో ఈ కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ఇండియా పేరుతో నిర్వహించగా, కనకాద్రిపురంలో తయారు చేస్తున్న చిరుధాన్యాలు ఎంపికయ్యాయి.