ATP: నార్పల మండలంలోని తాడిపత్రి-ధర్మవరం రహదారిపై గుంతలు పడ్డాయి. బీ. పప్పూరు, బొందలవాడ గ్రామాల సమీపంలో గోతులు పడి అధ్వానంగా తయారయ్యాయి. రోడ్డు ప్రయాణం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గోతులు పూడ్చాలని కోరుతున్నారు.