ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. వెలిగండ్లలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. అనంతరం ప్రజా సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు.