ప్రకాశం: పొన్నలూరు మండలంలోని మాలపాడు శివారులోని పొలాల్లో నిర్వహిస్తున్న జూదం శిబిరంపై పొన్నలూరు ఎస్సై అనూక్ తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మద్యం, జూదం వంటివి పాల్పడితే ఉపేక్షించమన్నారు.