PLD: వినుకొండ మండలం దొండపాడు గ్రామంలో పిడుగుపడి మరణించిన కొండయ్య కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో పల్నాడు జిల్లాలో అనేకమంది రైతులు పిడుగుపడి రైతులు మరణించారని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి ఆదుకోవాలని కోరారు.