KKD: నగరంలో ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని నగరపాలక కమిషనర్ భావన పారిశుధ్య నిర్వహణ అధికారులు సిబ్బందికి సూచించారు. అలాగే నగర ప్రజలు కూడా తడి, పొడి చెత్తలను వేరువేరుగా అందజేసి కాకినాడ నగరం స్వచ్ఛంగా ఉండేందుకు సహకరించాలని ఆమె కోరారు. శుక్రవారం ఉదయం కాకినాడ నగరంలో 41,42వ డివిజన్ రవిచంద్ర హాస్పిటల్ పరిసర ప్రాంతంల్లో కమిషనర్ తనిఖీ చేశారు.