NLR: కోట మండలం ఉత్తమనెల్లూరు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన ఈదురు ప్రసాద్, హేమంత్ మధ్య గత నెలలో చెరువులో మట్టి తవ్వాకల వద్ద గొడవ జరిగింది. ఇది మనస్సులో పెట్టుకున్న హేమంత్ నేడు ప్రసాద్ పై దాడి చేసినట్లు బాధితుడు వాపోయాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.