నెల్లూరు: పీఎం సూర్యఘర్ పథకంపై ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలోని అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్ఈ విజయన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్లో జిల్లాలోని డీఈలు, డీఈఈలు, ఏఈలు, అకౌంట్స్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. విద్యుత్ బకాయి వసూళ్లలో డీలిస్ట్ను పక్కాగా రూపొందించాలని సూచించారు.