నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. తమ సమస్యలపై ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు అర్జీలను అందజేయాలని కోరారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.