KRNL: కర్నూలు జిల్లాలోని నీటి వనరులు, నీటి పరీవాహక ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ బీ.నవ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, సర్వే మొదలగు సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సీసీఎల్ఏ ఆదేశాలను పాటిస్తూ చర్యలు తీసుకోవాలని అన్నారు.