PLD: నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయించేందుకు తీసుకొచ్చిన ఏడు కిలోల గంజాయిని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ విజయచరణ్ వివరాల మేరకు.. నరసరావుపేట వరవకట్టకు చెందిన ఐదుగురు పట్టణ పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మేందుకు ఏడు కిలోలు తీసుకొచ్చారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని తనిఖీ చేయగా ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.