తూ.గో: దేవర సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గందరగోళం సృష్టించారు. ఉప్పాడ శ్రీనివాస థియేటర్లో అభిమానుల కోసం వేస్తున్న సినిమా కోసం అభిమానులు బారులు తీరడంతో టిక్కెట్లు సరిపోకపోవడంతో అభిమానులు థియేటర్ను స్వల్పంగా ధ్వంసం చేశారు. స్థానిక ఎస్ఐ వెంకటేష్ బుధవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు.