KDP: దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కృత్రిమ అవయవాల శిబిరం నిర్వహిస్తున్నట్లు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సరస్వతి శ్రీధర్ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని సరస్వతి విద్యా మందిరంలో అక్టోబర్ 24వ తేదీన ఉచిత జైపూర్ కృత్రిమ వస్తువులు (కాలు, చేయి) అందిస్తామని తెలిపారు. అక్టోబర్ 15వ తేదీన కొలతలు తీసుకుంటామన్నారు.