NDL: నంద్యాలలోని శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల ఛైర్మన్ డా.పీ.దస్తగిరి రెడ్డి, డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, షేక్షావల్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా స్థాయిలో నిర్వహించే త్రో బాల్ టోర్నమెంట్ పోటీలకు సంబంధించిన గోడ పత్రికలను మంత్రి ఆవిష్కరించారు.