GNTR: తాడేపల్లి ప్రెస్-క్లబ్ నూతన అధ్యక్షుడిగా జొన్న వెంకటేష్ ఎన్నికయ్యారు. తాడేపల్లి ప్రెస్-క్లబ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడిగా జొన్న వెంకటేష్, ప్రధానకార్యదర్శిగా టీ.నాగిరెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సేవలందించిన టీ.నాగిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా పీ.సుబ్రమణ్యం ఎన్నిక చేశారు.