W.G: తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐగా సత్తి మణికంఠరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జగ్గయ్యపేట నుంచి బదిలీపై వచ్చిన మణికంఠరెడ్డి మంగళవారం విధుల్లోకి చేరారు. ఆయన స్థానంలో ఇక్కడ పని చేసిన మద్దాల శ్రీనివాసరావు పాలకొల్లు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన సీఐకి కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.