అన్నమయ్య: తంబళ్లపల్లె హుండీ ద్వారా రూ.5.94 లక్షల ఆదాయం తంబళ్లపల్లి మల్లయ్య కొండలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలతో రూ.5,94 లక్షల ఆదాయం వచ్చినట్టు బుధవారం సాయంత్రం ఈఓ మునిరాజ, టీఐ శశికుమార్ తెలిపారు. జూలై 11నుంచి అక్టోబర్ 30వరకూ భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు.