VSP: హోంమంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేట అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి హోంమంత్రి వంగలపూడి అనిత తీసుకెళ్లారు. కోటవురట్ల మండలంలో లింగాపురం నుంచి కొడవటిపూడి కట్ట వరకు సుమారు కి.మీ మేర నిర్మించనున్న ఆర్అండ్బై రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని కోరారు. పాయకరావుపేటలోని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తికి చొరవ చూపాలని కోరారు.