మన్యం: మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు, సీతానగరం ఎక్సైజ్ స్టేషన్లు పరిధిలో 52 దుకాణాలకు దరఖాస్తులు సేకరించబోతున్నామని మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ మంగళవారం తెలిపారు. అక్టోబరు ౩ నుంచి 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 11న ఎం.ఎ.నాయుడు కన్వెన్షన్ హాలులో షాపుల కేటాయింపు ప్రక్రియ చేపడతామని తెలిపారు.