VZM: జనావాసాల్లో మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని ప్రభుత్వ బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీ కృష్ణారావు డిమాండ్ చేశారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జనావాసాల మద్యం దుకాణాలతో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి దుకాణాలను వేరే చోటకి మార్పు చేయాలని పేర్కొన్నారు.