KRNL: జగన్, షర్మిల వ్యవహారంలో సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించడం వైసీపీ నాయకులకు తగదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తల్లిపై కొడుకు కేసు పెట్టిన చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఇకనైనా వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు చేశారు.