కోనసీమ: పి.గన్నవరంలో డిసెంబర్ 12న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని గద్దర్ జాతీయ సేవా పురస్కారం అవార్డులు అందించనున్నారు. ఈ కార్యక్రమం పోస్టర్లను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం పి.గన్నవరం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. మమత స్వచ్చంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోల్కొండ జాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు.