ASR: అరకులోయ మండలంలోని సంతోష్ నగర్లో స్థానిక పంచాయతీ సర్పంచ్ పెట్టేలి సుస్మిత ఆదేశాల మేరకు కొత్త వీధి దీపాలు బుధవారం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వీధి దీపాలు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పంచాయితీ నిధుల ద్వారా కొత్త వీధి దీపాలు సర్పంచ్ సుస్మిత ఏర్పాటు చేశారని స్థానిక నాయకులు సాంబ తెలిపారు.