కృష్ణా: జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఐదు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం అబ్దుల్ మతీన్, పెడన శొంఠి నాగరాజు, అవనిగడ్డ అందె శ్రీరామ్మూర్తి, గన్నవరం గొల్లు కృష్ణ, పెనమలూరు ధనేకుల మురళీ మోహనరావులను నియమించారు.