W.G: సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఇవాళ రైతుల పరిస్థితిని వాళ్లకు వాళ్లే వదిలేసే పరిస్థితి ఏర్పరిచారన్నారు. ఇవాళ ఏదైతే ఉచిత బీమా పథకం ఉందో ఆ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం పునరుద్ధరించకపోతే రైతుల ఉసురు కొట్టుకుపోతారని మండిపడ్డారు.