కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్లో శనివారం మెడికల్ వార్డు వద్ద లిఫ్టులో రోగులు ఇరుక్కున్నారు. మెడికల్ వార్డులో ఏర్పాటు చేసిన లిఫ్టు టెక్నీషియన్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాగే గతంలో చాలాసార్లు జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని రోగులు వేడుకున్నారు.