KDP: పోరుమామిళ్ల పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దీపావళి సందర్భంగా అమ్మవారికి ధనలక్ష్మి పూజ చేశారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పూజా అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.