KRNL: మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని రైతులు సంబరపడ్డారు. వరి ధాన్యం ధరలు సైతం ఆశాజనకంగా ఉండటంతో తమ కష్టాలు తీరాయని ఆశపడ్డారు. అంతలోనే అల్పపీడనం రూపంలో కురిసిన వర్షం రైతుల కష్టాన్ని నేలపాలు చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో వరి దెబ్బతింది. పైరు నేలవాలడంతో రైతులు తీవ్ర వేదనలో మునిగిపోయారు.